పెదరావూరు

(వికీపేడియా నుండి సేకరణ)
 
పెదరావూరు, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 202., యస్.టీ.డీ.కోడ్ 08644.
 
ఇది తెనాలి నుండి 3 కి.మి దూరంలో ఉంది. గ్రామ జనాభా షుమారు 6000.
సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య మరియు త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి గారు ఈ గ్రామ వాస్తవ్యులు.
 
ఈ గ్రామవాసులయిన కొడాలి భవ్యశ్రీ అమెరికాలోని క్యాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో హైస్కూల్ చదువు పూర్తి చేసినది. ఈమె వ్రాసిన ' 'విండిక్టివ్' అను నవల అక్కడ బహుళ ప్రజాదరణ పొందినది.
 
ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో జన్మించిన, ఎం.బి.ఏ చదివి ఎం.సి.ఏ చదువుచున్న ఘట్టమనేని సాయిరేవతి, అంచెలంచెలుగా ఎదుగుతూ వెయిట్ లిఫ్టింగ్ లో ఎన్నో రికార్డులు సాధించింది. తాజాగా ఈ 2013 జులైనెలలో 21 నుండి 26 వరకూ కర్నాటకలోని మంగుళూరులో భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సీనియర్ స్థాయి పోటీలలో ఒక బంగారు పతకం, ఒక వెండి పతకం గెలుచుకున్నది. అన్ ఎక్విప్ డ్ విభాగంలో మొత్తం 317.5 కిలోలబరువును యెత్తి బంగారు పతకం గెలుచుకున్నది. ఎక్వి ప్డ్ విభాగంలో 160కిలోల బరువు యెత్తి వెండి పతకం గెలుచుకున్నది. రేపో, మాపో దేశం తరపున ఆడేటందుకు సమాయత్తమగుచున్నది.
 
"పెదరావూరు" గ్రామం ఉద్దండుల పంచాయతీగా పేరు పొందినది. నాడు గ్రామ పంచాయతీ సర్పంచులుగా పనిచేసినవారు ఉత్తమపాలకులుగా కీర్తి పుటలకెక్కారు. 1928లో ఈ గ్రామ తొలి సర్పంచిగా శ్రీ శాఖమూరి వెంకటరామయ్య పనిచేశారు. తదనంతరం 1956 నుండి 1970 వరకూ, తిరిగి 1981 నుండి 1988 వరకూ సుదీర్ఘకాలం పనిచేసిన సర్పంచిగా శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు గుర్తింపు పొందినారు. శ్రీమతి రావూరి సామ్రాజ్యం తొలి దళిత మహిళా సర్పంచిగా 2001 నుండి 2006 వరకూ పనిచేశారు. శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు గుర్తింపు పొందినారు. శ్రీమతి రావూరి సామ్రాజ్యం తొలి దళిత మహిళా సర్పంచిగా 2001 నుండి 2006 వరకూ పనిచేశారు. శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు కూచిపూడి(తెనాలి) సమితి అధ్యక్షులుగా, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్సులుగా, సహకార సంస్థ అధ్యక్సులుగా గ్రామస్థుల మన్ననలందుకున్నారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు రామకృష్ణయ్య జిల్లా ఖాదీ బోర్డు అధ్యక్షులుగా పని చేశారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ మారౌతు సీతారామయ్య గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. వీరు గ్రామానికి కొత్త గుర్తింపు తెచ్చారు. 
 
పెదరావూరు గ్రామ పంచాయతీ 1923లో ఏర్పడింది. ప్రస్తుత గ్రామ జనాభా=5,380.ఓటర్లు:- పురుషులు=2,622. స్త్రీలు=2758. మొత్తం=5,380. వార్షికాదాయం=రు.12లక్షలు. ఈ గ్రామంలో 2006 నుండి అభివృద్ధి ఎక్కువ జరిగినది. బురదకూపంగా ఉండే మట్టిరోడ్లు సిమెంటురోడ్లుగా, కునారిల్లుతూ వెలుగుతున్న వీధిదీపాలు ట్యూబ్ లైట్లుగా మారినవి. పార్టీలకతీతంగా గ్రామం ప్రగతిబాటలో అడుగులు వేయడానికి అప్పటి సర్పంచి శ్రీ మాదల వెంకటభానుప్రసాద్ కృషే కారణం. పెదరావూరు గ్రామ అభివృద్ధికి, తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ తో పాటు ప్రస్తుత ఎం.పి.శ్రీ రాయపాటి సాంబశివరావు , ఒకప్పటి ఎం.పి.శ్రీ ఎడ్లపాటి వెంకటరావు, ఎం.ఎల్.సి.లు శ్రీమతి నన్నపనేని రాజకుమారి, శ్రీ కె.ఎస్.లక్ష్మనరావుల నుండి, నిధులు విడుదలైనవి. పారదర్శకంగా పూర్తి స్థాయిలో నిధులు వినియొగించినందుకుగాను, 2009-10లో జిల్లా ఉత్తమ సర్పంచిగా శ్రీ మాదల వెంకటభానుప్రసాద్ ఎంపిక కావడాఅనికి కారణమైనది. జిల్లా మంత్రి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, అప్పటి కలెక్టర్ శ్రీ విష్ణు నుండి అభినందనలు అందుకున్నారు. ఐదేళ్ళలో గ్రామంలో 80 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం, ఓవర్ హెడ్ ట్యాంకు, మంచినీటి పైపులైను నిర్మాణం చేపట్టినారు. మండల అభివృద్ధి నిధులతో, సిమెంటు రహదారులు, పంచాయతీ అంతర్గత నిధులతో సిమెంటు రహదారులు, మురుగు కాలువలు నిర్మించారు. 2 కోట్ల ఖర్చుతో గ్రామాభివృద్ధి జరిగినది. ఇంకా 4.5 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం, మరో 5 లక్షల రూపాయలతో సామాజిక భవనం, 2 అంగనవాడీ భవనాలు, శుద్ధజలo అందించేటందుకు ఆర్.వొ. ప్లాంటు ఏర్పాటు చేశారు. రాష్ట్రలో మొట్టమొదటి "డిజిటల్" గ్రంధాలయం ఏర్పాటుచేసిన ఘనత పెదరావూరుకే దక్కింది.